KRNL: కర్నూలు భగవాన్ శ్రీ బాల సాయిబాబా ఆశ్రమంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ట్రస్ట్ ఛైర్మన్ ఎస్. వినోద్ కుమార్ తెలిపారు. బుధవారం అన్నదానాన్ని మొదటి రోజు ప్రారంభిస్తూ.. ఆశ్రమం చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. హెచ్ఐవీ బాధితులకు రూ. 2,000 విలువైన పౌష్టికాహార కిట్లను పంపిణీ చేసి, వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.