SKLM: విశాఖపట్నంలోని డైమండ్ పార్క్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం మద్యం మత్తులో స్నేహితుడిపై కర్రతో దాడి చేయడంతో ఒడిశాకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి మృతి చెందాడు. ఎచ్చెర్లకు చెందిన లక్ష్మణ్ రెడ్డి, చిరంజీవి స్నేహితులు. అయితే డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఈ ఘోరం జరిగింది. పోలీసులు నిందితుడు లక్ష్మణ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.