MBNR: నవాబ్‌పేట మండలం దొడ్డిపల్లి గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి గుండె జబ్బుతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆయన కుటుంబం ఆందోళన చెందింది. ఈ విషయం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి చికిత్స కోసం రూ.5 లక్షల ఎల్వోసీని విడుదల చేయించారు.