తూ.గో: గోకవరం గంగాలమ్మ గుడి వద్ద పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు చేస్తున్న దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. మండలంలో 120 మంది లబ్ధిదారులకు గృహాలు మంజూరు కాగా అవి ఇప్పటివరకు పూర్తి కాకపోవడంతో నిర్వాసితులు అద్దె ఇంట్లో ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా గృహాలను పూర్తి చేసి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ప్యాకేజ్ అందించాలన్నారు.