ADB: భీంపూర్ మండలంలోని ఇందూరుపల్లి గ్రామంలో పీవీటీజీ పథకం కింద మంజూరైన 60 ఇందిరమ్మ ఇళ్లకు స్థానిక నాయకులు గురువారం భూమి పూజ చేశారు. మాజీ సర్పంచ్ టేకం దాదారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కపిల్ యాదవ్, నితిన్, సుధాకర్ తదితరులున్నారు.