WGL: జాతీయ జలసంరక్షణ కేటగిరీ-2లో వరంగల్ జిల్లా దేశవ్యాప్తంగా ప్రథమ స్థానం సాధించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జిల్లాకు అవార్డుతో పాటు రూ.1 కోటి నగదు బహుమతి అందజేశారు. ఈ ఘనత సాధించిన సందర్భంగా ఇవాళ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, అధికారులు, సిబ్బంది కలెక్టర్ డా. సత్య శారదను అభినందించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.