JGL: ఎండపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు 38 బెంచీలు మంజూరైనట్లు హెచ్ఎం. దాశెట్టి రవీందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రవేశపెట్టిన ఈ పథకం కింద మంజూరైన 38 బెంచీల విలువ సుమారు రూ. 5 లక్షలు ఉంటుందని హెచ్ఎం తెలిపారు.