ASF: వ్యవసాయ యాంత్రికరణ పరికరాల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని కెరమెరి మండల AO యుగేందర్ ప్రకటనలో తెలిపారు. బ్యాటరీ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, రోటోవేటర్లు, సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ తదితర పరికరాల కొరకు రైతులు ఈనెల 20, 21 తేదీల్లో కెస్లాగూడ రైతు వేదికలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. SC, ST, మహిళ, చిన్న, సన్న కారు రైతులకు 50%, రాయితీపై అందిస్తామన్నారు.