భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఇటీవల ఆ దేశ విదేశాంగ మంత్రి ముత్తాఖీ పర్యటన తర్వాత ఇప్పుడు మరో మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ న్యూఢిల్లీకి వచ్చారు. ఈ పర్యటనతో బలమైన దౌత్య, ఆర్థిక ఒప్పందాలు కుదరనున్నాయి. పాకిస్తాన్ పదేపదే సరిహద్దులను మూసేసి వాణిజ్య ఒత్తిడి పెంచుతుండటంతో భారత్తో సంబంధాలు తమ సమస్యలకు పరిష్కారం అవుతాయని తాలిబాన్ భావిస్తోంది.