నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. వో. నందన్ నిన్న పారిశుద్ధ్య సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, బహిరంగ ప్రదేశాలలో ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించాలని ఆదేశించారు. అలాగే, నగరపాలక సంస్థ కార్యాలయానికి చెల్లించవలసిన ట్రేడ్స్ లైసెన్సు బకాయిలను వేగవంతంగా వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.