ప్రకాశం: ఉపాధ్యాయుల బోధన నాణ్యతను మెరుగుపరిచేందుకు టచ్ టూల్ ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖాదికారి కిరణ్కుమార్ అన్నారు. కొత్తపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల టచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను ఆయన గురువారం ప్రారంభించారు. ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్థికి టచ్ టూల్ ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.