CTR: అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజనలో భాగంగా కుప్పం నియోజకవర్గ పరిధిలో 36,473 వేల మంది రైతులకు రూ.23.75 కోట్లు లబ్ధి చేకూరిందని ఏఎంసీ ఛైర్మన్ జీఎం రాజు తెలిపారు. రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు జమ చేశాయని, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.7వేలు చొప్పున జమ చేశామన్నారు.