MLG: మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యంతో డ్రైనేజీ కాలువలు పూడికతో నిండిపోయాయి. వ్యర్థాలను సకాలంలో తొలగించకపోవడంతో నీరు నిలిచి బురదమయంగా మారింది. ముఖ్యంగా కూరగాయల మార్కెట్ పరిసరాల్లో దుర్గంధం భరించరాని స్థాయికి చేరింది. రోడ్లపై నడవడం కూడా కష్టంగా మారింది. వెంటనే పూడిక తొలగించి కాలువలను శుభ్రం చేయాలని అధికారులను కోరారు.