WNP: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై గురువారం వనపర్తి కలెక్టర్లో సమీక్ష నిర్వహించనున్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో ఉదయం 11గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లికృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డిలు హాజరుకానునట్లు జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సీతారాం తెలిపారు.