PLD: నరసరావుపేట పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు నరసరావుపేట- వినుకొండ రోడ్డులోని బస్టాండ్ పరిసరాలు, మార్కెట్ యార్డు ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించకుండా జూట్ బ్యాగులను వినియోగించాలని దుకాణదారులకు సూచించారు.