AP: మాజీ సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకోనున్నారు. అక్రమ ఆస్తుల కేసులో ఈరోజు నాంపల్లి CBI కోర్టు విచారణకు ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్ట్ వద్దకు YCP కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరోవైపు, CBI కోర్టు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.