కోనసీమ: వాడపల్లి వెంకటేశ్వరస్వామివారి దేవస్థానం నందు బుధవారం జరిగిన హుండీ లెక్కింపు సమయంలో చోరీకి పాల్పడిన ముద్దాయి వాసంశెట్టి శ్రీనివాసుకు 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ ఎస్.రాము గురువారం తెలిపారు. బుదవారం జరిగిన ఆలయ హుండీ లెక్కింపులో పాల్గొని 60 వేల రూపాయలు దొంగతనం చేసి తీసుకెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డాడు.