SKLM: నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్ వైసీపీ రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ సూచన మేరకు ఈ పదవిని నరసన్నపేట నియోజకవర్గానికి కేటాయించారు. వైసీపీ రాష్ట్రస్థాయి నాయకత్వం తమ నియోజకవర్గాని దక్కడం పట్ల స్థానిక నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.