సత్యసాయి: సాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో బీజేపీ నాయకుడు కొండమ రాజు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులకు పంపిణీ చేయడానికి 100 కేజీల భారీ లడ్డూను సిద్ధం చేశారు. భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాయిబాబాకు నివాళులర్పించి, లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించారు.