ELR: స్వశక్తితో ఎదగాలనుకునే వారికి శక్తివంచన లేకుండా తాను సహకారం అందిస్తున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. వివిధ సేవా మార్గాల్లో అవసరార్థులకు తోడ్పాటు ఇస్తున్నామన్నారు. ఏలూరులో తన సొంత నిధులతో పాటు దాతల సహకారంతో సమకూర్చిన 7 తోపుడు బండ్లు, 1 ట్రైసైకిల్, 1 కుట్టుమిషన్ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.