VZM: కొత్తవలస తహసీల్దార్ అప్పలరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మన్యం జిల్లా సీతంపేట నుంచి నాలుగు నెలల క్రితం కొత్తవలస బదిలీపై వచ్చారు. ఆయన వచ్చినప్పటినుంచి అక్రమాలు చేస్తూ, వసూళ్లకు పాల్పడుతున్నారు. మండలంలోని పలు రెవెన్యూలో రికార్డులకు మ్యూటేషన్లకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపించారు.