VSP: భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ పలు వార్డుల్లో 15 రోజుల్లోనే రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం తెలిపారు. సాయిరాం నగరంలో ఏడు కోట్లతో చేపడుతున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రహదారులు, డ్రైనేజీలు, మౌలిక వసతులు ప్రాధాన్యతగా ఉండే విధంగా పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.