ప్రకాశం: ఒంగోలుకు చెందిన 5వ తరగతి విద్యార్థి మహామ్మద్ ఫర్హాన్ వినికిడి లోపంతో బాధపడుతూ ఎన్-7 స్పీచ్ ప్రాసెసర్ మంజూరు చెయ్యాలని తల్లి సబిహా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిను కలిసి విన్నవించారు. ఆమె అభ్యర్థనకు స్పందించి ఎంపీ వారి నిథుల రూ. 4,05,400లు ఎంపీ ల్యాండ్ నుంచి మంజూరు చేశారు. గురువారం ఒంగోలులో ఎన్-7 స్పీచ్ కలెక్టర్ ఆమెకు అందజేశారు.