MBNR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ జేఏసీ కన్వీనర్ బూరుగుపల్లి కృష్ణ యాదవ్ అన్నారు. గురువారం రాత్రి బీసీ జేఏసీ సేన బీసీ జాగృతి సేన బీసీ సంకల ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేయడం మానుకోవాలన్నారు.