ELR: ఏలూరు వైఎస్సార్ కాలనీలో ఓ మహిళ పట్ల అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాలనీకి చెందిన ఓ మహిళ భర్త పని నిమిత్తం ఊరెళ్లగా.. ఆమె బంధువుల ఇంటి వద్ద నిద్రిస్తోంది. ఈ క్రమంలో స్థానికుడైన సోమ సాయి ఇంట్లోకి ప్రవేశించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు రూరల్ ఎస్సై నాగబాబుకు పిర్యాదు చేశారు.