SRCL: కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని క్యాబినెట్ సెక్రటరీ (కో-ఆర్డినేషన్), సెంట్రల్ సెక్రటేరియట్ ఆదేశించారు. భూసేకరణ, రైల్వే లైన్ పనులు, ఇతర అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెను జిల్లా కలెక్టరేట్ నుంచి ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. పనుల వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు.