TG: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేశాడు. తండ్రి వేధింపులు తాళలేక ఆ కూతురు తల్లికి చెప్పుకుని బోరుమంది. దీంతో తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు చేపట్టారు.