CTR: పుంగనూరులో అనధికార నిర్మాణాలు, అనుమతికి మించిన నిర్మాణాలు చేపట్టిన వారికి ప్రభుత్వం ఓ అవకాశం ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి 11వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. వాటిని పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా ఇళ్ల నిర్మాణాలకు అధికారికంగా అనుమతులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.