భారత్, పాకిస్తాన్ యుద్ధం అంశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. ఆ రెండు దేశాల మధ్య అణు యుద్ధాన్ని తానే స్వయంగా ఆపినట్లు తెలిపారు. రెండు దేశాలపై 350శాతం వాణిజ్య సుంకాలు విధించి. అమెరికాతో వాణిజ్యాన్ని నిలిపివేస్తానని బెదిరించడంతో ఇది సాధ్యమైందని అన్నారు. కాగా, ట్రంప్ వల్లే యుద్ధం ఆగిందని పాక్ తెలుపగా.. భారత్ దాన్ని ఖండించింది.