GNTR: గుంటూరులో పెరిగిన వీధి కుక్కల బెడదను దృష్టిలో ఉంచుకుని, వాటి జనాభా నియంత్రణకు జీఎంసీ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, రూ. 145 లక్షల అంచనా వ్యయంతో పొన్నూరు రోడ్డు డంపింగ్ యార్డులో ఏబీసీ (Animal Birth Control) కేంద్రం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. ఈ నూతన కేంద్రంలో రెండు ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.