తూ.గో: సీతానగరం మండలం వంగలపూడి గ్రామానికి చెందిన యాళ్ల శైలు అనే బాలిక (16) ఈనెల 17వ తేదీన తెల్లవారుజాము నుంచి కనిపించడం లేదని తండ్రి వెంకటేష్ సీతానగరం పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశాడు. ఎస్సై రామ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే ఈ నెంబర్కు 9440904829 తెలపాలన్నారు.