KMR: చుట్టుపక్కల గ్రామాల్లో పొద్దెక్కినా పొగమంచు విడవట్లేదు. గురువారం చిన్నమల్లారెడ్డి, పాతరాజంపేట, సరంపల్లి, నర్సన్నపల్లి గ్రామాలు ఉదయం సూర్యోదయం వెలుగుల్లో కూడా మసకబారి కనిపించాయి. ప్రతిరోజూ పొగమంచు దట్టంగా కమ్మేస్తూ ఉదయం 10 వరకు అలాగే ఉంటుందని స్థానికులు తెలిపారు. పొగమంచుతో పాటు చలి ప్రభావంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.