KMM: జిల్లాలోని పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణ కోసం ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల’ ఖాతాలకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,160 పాఠశాలలకు సంబంధించి మొత్తం రూ. 1,13,78,000 నిధులను విడుదల జారీ చేశారు. రెండు నెలల కాలానికి ఈ నిధులను ఏఏపీసీ సభ్యులు పాఠశాలల్లో మౌలిక వసతుల కొరకు వినియోగించాలన్నారు.