E.G: రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరిపై డీసీసీ అధ్యక్షుడు టి.కే విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలను జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఖండించారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద ఆయన మాట్లాడారు. నియోజవర్గ అభివృద్ధికి ఎంపీ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంపీపై అసత్య విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.