ADB: ఉట్నూర్ అడిషనల్ ఎస్పీ కాజల్ సింగ్ను గురువారం జిల్లా ఆదివాసీ పెద్దలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 23వ తేదీన మండల కేంద్రంలో జరగనున్న ‘ధర్మ యుద్ధ సభ’ నిర్వహణ కోసం అనుమతి ఇవ్వాలని వినతి పత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన అడిషనల్ ఎస్పీ.. సభ ఏర్పాటు కోసం అనుమతి ఇచ్చారని సార్మేడి మెస్రం దుర్గు పటేల్ తెలిపారు.