పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా అంటూ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత రవిశంకర్ ఈ మూవీపై అప్డేట్ ఇచ్చాడు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఇది రిలీజ్ కానున్నట్లు తెలిపాడు. అయితే తేదీని మాత్రం ప్రకటించలేదు.