VZM: జడ్పీ CEO బి. సత్యనారాయణ గురువారం బొండపల్లి మండలం బోడసింగి పేట గ్రామాన్ని సందర్శించారు. ఈ మేరకు ఇంటింటి చెత్త సేకరణ, వాటర్ ట్యాంక్, చెత్త నుంచి సంపద తయారికేంద్రం తనిఖీ చేశారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారి కేంద్రం పూర్తి స్థాయిలో పని చేసేలా చూడాలని, శానిటేషన్ మెరుగుపరచాలని,15 రోజులకొకసారి ట్యాంక్ క్లీన్ చేయించాలని సిబ్బందికి ఆదేశించారు.