CTR: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.1.66 కోట్లు మంజూరైంది. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కింద ఈ నగదు చెల్లిస్తామని జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ ఇవాళ తెలిపారు. ఏడాదికి రూ. 6వేలు చొప్పున మొదటి విడతగా జిల్లాలో 5,553 మందికి 5నెలలకు రూ.1.66 కోట్లు జమ చేశామన్నారు.