ADB: అప్రమత్తతో ఉంటూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం తెలియజేశారు. ప్రమాదాల నివారణకై జిల్లా పోలీసులు రోడ్ సేఫ్టీ క్లబ్ ప్రారంభించినట్లు వెల్లడించారు. శీతాకాలంలో రహదారులపై పొగమంచు వల్ల వాహనదారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. జాగ్రత్తలతోనే ప్రమాదాల నివారణ సాధ్యమని పేర్కొన్నారు.