20 ఏళ్ల క్రితం సంచలనాత్మకమైన నటి ప్రత్యుష మృతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షణను సవాల్ చేస్తూ నిందితుడు సిద్దార్థ రెడ్డి, మరోవైపు సిద్ధార్థకు విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీ దాఖలు చేసిన అప్పీళ్లను SC రిజర్వ్ చేసింది. కాగా, 2002లో ప్రేమికులైన ప్రత్యుష, సిద్దార్థ విషం తాగగా.. ప్రత్యుష చనిపోయింది.