SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ 23వ వార్డు పరిధిలోని శివాజీ నగర్లో విద్యుత్ శాఖ అధికారులు కాలనీ బాట గురువారం నిర్వహించారు. సినిమా రోడ్డులోని ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. విద్యుత్ సరఫరా ఎలా జరుగుతుందో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.