WGL: నగరంలో ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణకు అనువైన స్థలాన్ని త్వరలో కేటాయిస్తామని మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఇవాళ బల్దియా ప్రధాన కార్యాలయంలో RTC అధికారులతో జరిగిన సమావేశంలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి మేయర పాల్గొన్నారు. సమర్థవంతమైన నిర్వహణకు అవసరమైన సూచనలు మేయర్ చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి తగిన స్థలాన్ని గుర్తిస్తామన్నారు.