MNCL: జన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారు. జన్నారంలో స్కూల్, జూనియర్ కళాశాల స్థాయి విద్య మాత్రమే విద్యార్థులకు అందుబాటులో ఉంది. డిగ్రీ చదవాలంటే లక్షెట్టిపీట, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, మంచిర్యాల పట్టణాలకు విద్యార్థులు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.