BPT: బాపట్ల జిల్లా అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై గురువారం తెల్లవారుజామున అద్దంకి పోలీసులు వాహన ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. దూర ప్రయాణాల నుంచి వచ్చి వెళ్లే వాహనాలను ఆపి డ్రైవర్లను మొహం కడిగించారు. నిద్ర సమయంలో ఇలా చేసి టీ తాగడంతో చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చని వాహనదారులకు పోలీస్ సిబ్బంది తెలియజేశారు.