అనంతపురం: ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను తన పార్టీ కార్యాలయంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలపై చర్చించారు. విలీన గ్రామపంచాయతీలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. 2026లో విలీన గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరపాలని వినతిపత్రం సమర్పించారు.