MBNR: అంతర్జాతీయ బాలల హక్కల దినోత్సవం గురువారం యూనిసెఫ్ సహకారంతో ‘లిసెన్ టు చిల్డ్రన్’ అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 17 మండలాల్లో, జిల్లా పాలక సంస్థతో పాటు మూడు మున్సిపాల్టీల్లో 22 చోట్ల ఉదయం10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. బాలలకు హక్కులు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.