MLG: ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీను నిన్న సాయంత్రం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.