కృష్ణా: గుడివాడలో రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ నిర్మాణం విస్తరణలో భాగంగా భీమవరం రైల్వే గేట్ వద్ద తమ భవనాన్ని NHAI అధికారులు కూల్చివేశారని మాజీ మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా, దానిని లెక్కచేయకుండా అధికారులు తమ భవనాన్ని కూల్చివేశారని నిన్న ఆయన ఆరోపించారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని తెలిపారు.