CTR: చిత్తూరులోని తేనెబండ రోడ్డు ఈశ్వరుని గుడి సర్కిల్, రామకృష్ణ ఆశ్రమం, ప్రభుత్వ అపోలో ఆసుపత్రి గోడ వద్ద రోడ్డుపై మృతదేహాలు తరలించే వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. స్థానికుల ఫిర్యాదుతో ట్రాఫిక్ సీఐ లక్ష్మీ నారాయణ అక్కడికి చేరుకున్నారు. వాహనాలను తొలగించడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పాయి.