విదేశీ ఉద్యోగుల ఆవశ్యకతపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. H-1B వీసా ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. US ఆర్థిక వృద్ధికి, కొత్తగా నిర్మించే భారీ ప్లాంట్లను నడపడానికి విదేశీ ఉద్యోగుల నైపుణ్యం తప్పనిసరి అని అంగీకరించారు. విదేశీ ఉద్యోగులు అమెరికన్లకు ఆ నైపుణ్యాలను నేర్పించిచాకే తిరిగి స్వదేశాలకు వెళ్లాలని ట్రంప్ సూచించారు.